ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో కూడా నటించనున్న సంగతి కూడా తెలిసిందే.
అయితే ఈ ప్రాజెక్టులు ఏమో కానీ ఓ దర్శకుడు మాత్రం తారక్ తో సినిమా చెయ్యాలని గట్టిగా ట్రై చేస్తున్నారట. అతనే ప్రముఖ రచయిత వక్కంతం వంశీ. ఈ దర్శకుడు ఇప్పటికే చాలా సినిమాలకు కథలను అందించిన ఈ రచయిత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో “నా పేరు సూర్య” తో దర్శకునిగా పరిచయం అయ్యారు.
కానీ ఆ చిత్రం ఊహించని స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయితే వక్కంతం వంశీ ఎప్పటి నుంచో తారక్ తో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఓసారి తారక్ తో సినిమా చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారట. టెంపర్ టైం నుంచీ వంశీ తారక్ తో ఒక ప్రాజెక్ట్ చెయ్యాలని ట్రై చేస్తున్నారు. మరి తారక్ ఈ దర్శకుడు ఎప్పుడు సినిమా చేస్తారో చూడాలి.