వీరి పల్స్ ను అర్ధం చేసుకున్న ప్రభాస్ డైరెక్టర్..!

వీరి పల్స్ ను అర్ధం చేసుకున్న ప్రభాస్ డైరెక్టర్..!

Published on Oct 9, 2020 7:00 AM IST

ఇప్పుడు మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ చిత్రాల్లో ఒకటైన ప్రాజెక్ట్ నాగశ్విన్ తో ప్లాన్ చేసింది. ఈ సినిమా విషయంలో ఇంకొన్ని గంటల్లో ఒక బడా అప్డేట్ ను రివీల్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ తెలిపారు.

అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.కానీ ఒకప్పుడు అయితే కనీసం పండుగకు అప్డేట్ కూడా గగనమే అని చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రభాస్ లైనప్ లో ఉన్న దర్శకుల్లో మాత్రం నాగశ్విన్ అతని అభిమానుల పల్స్ ను బాగా అర్థం చేసుకున్నాడని చెప్పాలి.

మొదటి నుంచీ కూడా ఎప్పటికప్పుడు ఏదొక సమాచారాన్ని వారికి అందవేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వారిని నిరసపరచకుండా మంచి ప్లానింగ్ తో వస్తున్నాడు. ఇది మాత్రం మంచి విషయం అని చెప్పాలి.

దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఒకింత ఈ ప్రాజెక్ట్ కోసమే ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు కూడా..మొత్తానికి మాత్రం నాగశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ పల్స్ ను ఒడిసి పట్టి డీసెంట్ గా రాణిస్తున్నారు. మరి వీరు ఇవ్వనున్న అప్డేట్ ఏంటా అన్నది వేచి చూడాలి.

తాజా వార్తలు