అశ్వినీదత్ ప్రయత్నం పలిస్తే ఎన్టీఆర్ ఆ స్టార్ దర్శకుడితోనే..!

అశ్వినీదత్ ప్రయత్నం పలిస్తే ఎన్టీఆర్ ఆ స్టార్ దర్శకుడితోనే..!

Published on Apr 16, 2020 8:33 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ రీత్యా ఆయన కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేస్తున్న ఎన్టీఆర్ మే నుండి త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. కాగా ఎన్టీఆర్ 31వ చిత్రంపై గత కొంత కాలం అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ దర్శకులలో ప్రముఖంగా ప్రశాంత్ నీల్, అట్లీ పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే ఎన్టీఆర్ 31వ చిత్రం దాదాపు అట్లీ తో ఖాయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఎన్టీఆర్ తో మూవీ కోసం అట్లీకి ఎప్పుడో అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం ఉంది. అశ్విని దత్ వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ సెట్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. కాబట్టి త్రివిక్రమ్ తరువాత ఎన్టీఆర్ మూవీ దర్శకుడు అట్లీ తో ఉండవచ్చని వినికిడి. ఇక అట్లీకి మాస్ కమర్షియల్ సినిమాలు తీయడంలో మంచి పట్టుంది. అతని టేకింగ్ ఎన్టీఆర్ ఇమేజ్ కి చక్కగా సరిపోతుందని కొందరి అభిప్రాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు