క్రేజీ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ యాక్షన్ డ్రామా భారీ వసూళ్లు సాధించిందంటే.. అది దర్శకుడిగా ప్రశాంత్ గొప్పతనమే. దాంతో సహజంగానే ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్తోనా లేక బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తోనా. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేస్తారని ఫిక్స్ అయ్యారు.
కానీ, అంతలో షాహిద్ కపూర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని ఇటీవలే కొత్త చర్చ మొదలైంది. కాగా తాజాగా ప్రశాంత్ షాహిద్ కపూర్ ని మీట్ అవ్వనున్నారని, కథ చెప్పడానికే కలుస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో ఏదైనా అధికారిక అప్ డేట్ వచ్చేదాకా నమ్మలేం. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ పూర్తై ప్రశాంత్ నీల్ మరో సినిమా మొదలుపెట్టేనాటికి వచ్చే యేడాది ఆఖరు అవుతుంది.