100 కోట్ల క్రెడిట్ తెలుగు ఆడియెన్స్ కి ఇచ్చిన ‘డ్యూడ్’

Pradeep Ranganathan

ఈ మధ్య కాలంలో ఓ యువ హీరో వరుస విజయాలు అందుకోవడమే ఒకెత్తు అయితే వరుసగా 100కోట్ల గ్రాస్ సినిమాలు అందుకోవడం మరొక ఎత్తు అని చెప్పాలి. ఇలా వరుసగా ఇప్పుడు మూడు 100కోట్ల సినిమాలు అందుకున్న ఆ హీరో నే ప్రదీప్ రంగనాథన్. తన లవ్ టుడే, డ్రాగన్ ఇప్పుడు డ్యూడ్ లతో తన మార్కెట్ గట్టిగా సెట్ చేసుకున్నాడు.

అయితే ఈ 100కోట్ల క్రెడిట్ మాత్రం మన తెలుగు ఆడియెన్స్ కి కూడా ఇచ్చాడు.తన మూడు సినిమాలు తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ లేకుండా 100 కోట్ల మార్క్ దాటేవి కాదని తెలిపిన కామెంట్స్ ఇప్పుడు తనను తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ డ్యూడ్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతాడో చూడాలి.

Exit mobile version