మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 ఊహించని విధంగా ఇపుడు రాణిస్తుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా రెండోసారి చేస్తున్న ఈ గ్రాండ్ షో చప్పగా ఉందని మొదట్లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా తర్వాత మాత్రం మంచి ప్లానింగ్ తో వారికి కావాల్సిన అటెన్షన్ ను తెచ్చుకున్నారు. అయితే ప్రతీ వారం కూడా ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
అలా ఈ ఆదివారం ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నామినేషన్ లో ఉన్న జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయ్యిందని సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ లవబుల్ కంటెస్టెంట్ గంగవ్వ అసౌకర్యంగా ఫీల్ కావడంతో బయటికొచ్చేసిన సంగతి తెలిసిందే. మరి ఈరోజు ఎలిమినేట్ అయ్యింది ఆమేనా కాదా అన్నది తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ ను చూడాల్సిందే.