“బిగ్ బాస్ 4″లో ఈ కంటెస్టెంట్ కే ఎక్కువట.!

“బిగ్ బాస్ 4″లో ఈ కంటెస్టెంట్ కే ఎక్కువట.!

Published on Sep 12, 2020 4:20 PM IST

ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ కు మన తెలుగులో కూడా యమా క్రేజ్ దక్కింది. అలా ఇప్పటి వరకు మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇప్పుడు ఎట్టకేలకు నాలుగో సీజన్లోకి అడుగు పెట్టింది. అయితే ఈసారి సీజన్ కు మాత్రం ఆదిలోనే హంస పాదు అన్నట్టు నాగ్ ఎంట్రీ ఎపిసోడ్ మినహా మిగతా ఎపిసోడ్స్ వీటిపైనా కూడా అంత రెస్సాన్స్ రాకపోవడంతో బిగ్ బాస్ మేకర్స్ కీ చేంజెస్ చెయ్యడంలో పడ్డారు.

దీనికి కారణం బాగా తెలిసిన కంటెస్టెంట్స్ ఎక్కువ మంది లేకపోవడం మూలానే ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది. అయితే అన్ని సీజన్లలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే కంటెస్టెంట్ ఖచ్చితంగా ఒకరుంటారు. అలా ఈ సీజన్లో ప్రముఖ యాంకర్ లాస్య కు అత్యధిక రెమ్యునరేషన్ ముట్టినట్టు తెలుస్తుంది. ఈమెకు తప్పితే మిగతా వారికంతా కూడా అతి తక్కువ అమౌంట్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ చేశారట. మరి రాబోయే రోజుల్లో ఈ షో ఎలా ఉండనుందో చూడాలి.

తాజా వార్తలు