ఎన్టీఆర్-నీల్ మూవీలో జాయిన్ అయిన బాలీవుడ్ నటుడు.. ఎవరంటే?

ఎన్టీఆర్-నీల్ మూవీలో జాయిన్ అయిన బాలీవుడ్ నటుడు.. ఎవరంటే?

Published on Nov 28, 2025 6:00 PM IST

JrNTR-Neel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ఎన్టీఆర్-నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమాను భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌లో ఆయన జాయిన్ కాబోతున్నట్లు చిత్ర వర్గాల టాక్.

డిసెంబర్‌లో ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్ షూటింగ్ ఆ నెల మొత్తం సాగనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో అనిల్ కపూర్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు