కేవలం ఇదంతా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాపై నమ్మకమేనా?

కేవలం ఇదంతా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాపై నమ్మకమేనా?

Published on Sep 10, 2020 12:16 PM IST

ఇప్పుడు మన దేశీయ సినీ మార్కెట్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరోగా మన తెలుగు హీరో డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారిపోయాడు. బాహుబలి నుంచి వచ్చిన స్టార్డం ను అలా మైంటైన్ చేస్తూ వరుస భారీ చిత్రాలతో బిజీ గా మారిపోయాడు. దీనితో ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాను పసిగట్టిన మన మరియు బాలీవుడ్ బడా నిర్మాతలు సైతం ప్రభాస్ డేట్స్ కోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభాస్ చేతిలో వేలాది కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ఉన్నాయి.

అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తో ప్లాన్ చేస్తున్న “ఆదిపురుష్” బడ్జెట్ ఊహించని స్థాయిలో సెట్ చేసారు. దాదాపు 600 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసినట్టుగా ఆ మధ్య టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం వీరు ఈ చిత్రాన్ని ఎక్కడా తగ్గకుండా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించాలని భావిస్తున్నారట.

అందుకే ఈ బడ్జెట్ ను అవసరం అయితే ఎంతైనా సరే పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా ఈ చిత్రం మన దేశంలోనే భారీ బడ్జెట్ చిత్రంలా మలచనున్నట్టు తెలుస్తుంది. మరి ఇదంతా కేవలం ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా పై ఎంత నమ్మకం లేకపోతే ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తారు? ఒకవేళ ఇదే బడ్జెట్ తో కనుక ఈ చిత్రం తెరకెక్కినట్టయితే మన దేశంలో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ప్రాజెక్ట్ గా నిలుస్తుంది.

తాజా వార్తలు