నాని-సుజీత్ సినిమాలో విలన్ ఆయనేనా..?

నాని-సుజీత్ సినిమాలో విలన్ ఆయనేనా..?

Published on Sep 30, 2025 4:02 PM IST

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతుం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా పూర్తి కాకముందే, నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని మరో యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను గతంలోనే ఓకే చేశాడు నాని. ఇక దసరా పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నారు.

అయితే, ఈ సినిమాలో నాని పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని చిత్ర వర్గాల టాక్. దీనితో పాటు ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారనే వార్తపై కూడా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మలయాళ నటుడు కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ‘సలార్’ చిత్రంతో ప్రేక్షకులకు సుపరిచితుడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి ప్రెస్టీజియస్ చిత్రం SSMB29లో కూడా ఆయన నటిస్తున్నాడు.

ఇప్పుడు నాని-సుజీత్ కాంబోలో రాబోయే సినిమాలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడనే వార్తతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే, ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు