ఎన్టీఆర్ తీరిక లేకుండా కష్టపడాలి.

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్ కి కొంత బ్రేక్ దొరికింది. ఇక వచ్చే నెల నుండి నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. రాజమౌళి తాజా షెడ్యూల్ నార్త్ ఇండియాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

కాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కూడా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చాల ఆలస్యం అవుతున్న తరుణంలో జక్కన్న నిరవధికంగా చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారట. ఓ పక్క త్రివిక్రమ్ మూవీ లో కూడా ఎన్టీఆర్ నటించాల్సివుండగా ఎన్టీఆర్ కి తీరిక దొరికే సూచనలు కనిపించడం లేదు. విరామం లేకుండా ఎన్టీఆర్ ఈ రెండు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version