వైట్ మిల్క్ బ్యూటీ తమన్నా అందంతో పాటుగా అభినయం కలగలిసిన నటిగా నిరూపించుకుంది. తమన్నా సినిమాలో నటిస్తుంది కానీ నిజ జీవితంలో మాత్రం ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరొయిన్ కి దక్కేది మూడవ స్థానమే అంటుంది తమన్నా. కథ ఎంత బావున్నప్పటికీ కథానాయకుడికి మొదటి స్థానం, తరువాత ప్రతినాయకుడికి రెండవ స్థానం, ఆ తరువాత తమకి మూడవ స్థానం దక్కుతుంది. 100% లవ్, అవారా లాంటి సినిమాల్లో మాత్రమే హీరోకి సమానమైన పాత్రలు దక్కుతాయి. అలంటి పాత్ర దొరికినపుడే నా నటనా ప్రాధాన్యం చూపించడానికి ప్రయత్నిస్తాను. రామ్ చరణ్ సరసన తమన్నా ఇటీవలే రచ్చ సినిమాలో నటించింది. ఆమెకు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. తమన్నా త్వరలో పవన్ కళ్యాణ్ సరసన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించబోతుంది. అలాగే ప్రభాస్ సరసన రెబల్ సినిమాలో కూడా నటిస్తుంది.