100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!

100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!

Published on Sep 16, 2025 7:01 AM IST

OG

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. నెక్స్ట్ లెవెల్ హైప్ లో ఉన్న ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా అది బ్లాస్టర్ గా నిలిచింది. ఇలానే నిన్న వచ్చిన గన్స్ ఎన్ రోజేస్ సాంగ్ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

ఇలా ఆల్బమ్ పరంగా ప్రతీ పాట హిట్ కావడంతో పవన్ నుంచి బాగా వైరల్ అయ్యిన 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో కొట్టాం అన్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. ఇది మాత్రం నిజమే అని చెప్పాలి. ఓజి నుంచి వచ్చిన ప్రతీ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఆ మాట అనడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఈ సెప్టెంబర్ 25న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

తాజా వార్తలు