ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!

ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!

Published on Oct 26, 2025 3:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం ఓజి కోసం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నెల థియేటర్లులో విధ్వంసం చేస్తే ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రం దుమ్ము లేపుతుంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఊహించని రెస్పాన్స్ కొల్లగొడుతుంది అని చెప్పాలి.

తెలుగు ఆడియెన్స్, తమిళ్ వరకు ఈ సినిమాకి, పలు సీన్స్, ఎలివేషన్స్, మ్యూజిక్ కి మంచి రీచ్ ఉంటుంది అని చాలా మంది భావించారు కానీ అంతకు మించే ఓజి ఇప్పుడు అదరగొడుతుంది. మలయాళం, హిందీ ఆడియెన్స్ లో కూడా ఈ సినిమా సాలిడ్ రెస్పాన్స్ ని సోషల్ మీడియాలో అందుకుంటుంది. దీనితో ఓటీటీ లోకి వచ్చాక మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంటుంది అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు.

తాజా వార్తలు