తన అందం మరియు అభినయంతో సౌత్ ఇండియన్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కథానాయిక నయనతార. ఆమె నటించిన ‘శ్రీ రామరాజ్యం’ సినిమాకి గాను ఉత్తమ కథానాయికగా నంది అవార్డు సొంతం చేసుకుంది. ఈ విషయంపై స్పందించిన నయనతార మాట్లాడుతూ ‘ నేను ఎలాంటి అవార్డులను ఆశించి ఈ సినిమా చేయలేదు. బాపు మరియు బాలయ్య బాబు గారు నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన సీత పాత్రకు పూర్తి న్యాయం చేయగలిగితే చాలు అని దాని కోసమే కృషి చేసి ఈ సినిమా చేసాను. వారిద్దరూ నన్ను నమ్మి ఉండకపోతే నాకీ అవార్డు వచ్చి ఉండేది కాదు, ఈ అవార్డుకి వారే కారణం అని’ ఆమె అన్నారు.
‘శ్రీ రామరాజ్యం’ సినిమా తర్వాతా బాగా గ్యాప్ తీసుకున్న నయనతార ప్రస్తుతం రానా సరసన నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా నాగార్జున సరసన ‘లవ్ స్టొరీ'(వర్కింగ్ టైటిల్) చిత్రం మరియు తమిళంలో అజిత్ సరసన ఒక సినిమా చేస్తున్నారు.