కథ దొరికితే సినిమా చేస్తామంటున్న ఆరడుగుల హీరోలు

కథ దొరికితే సినిమా చేస్తామంటున్న ఆరడుగుల హీరోలు

Published on Aug 4, 2013 6:24 PM IST

Gopichand-and-Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాచో హీరో గోపీచంద్ లు ఆరడుగుల పర్సనాలిటీతో ఆజానుబాహుల్లా ఉంటారు. ఇలాంటి వీరిద్దరూ ఒకే సినిమాలో తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే పండుగ. ఇప్పటికే వీళ్ళిద్దరూ కలిసి ‘వర్షం’ సినిమాలో నటించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా గోపీచంద్ ‘ ప్రభాస్ తనకి మంచి స్నేహితుడు, అతనితో ఎక్కువ ఆత్మీయంగా ఉంటాను. ‘వర్షం’ తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ సినిమా చేయాలని మేమెంత అనుకుంటున్నా సరైన కథ దొరకడం లేదని’ అన్నాడు. ఒకవేళ వీరిద్దరికి సరిపోయే కథ దొరికితే సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు గోపీచంద్ చెప్పకనే చెప్పినట్టున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ ఎస్.ఎస్ రాజమౌళితో ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. తాజాగా ‘సాహసం’ సినిమాతో విజయం అందుకున్న గోపీచంద్ త్వరలోనే బి. గోపాల్ దర్శకత్వంలో చేసే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు