పూజాకు ఈ ముగ్గురి హీరోల ఫ్యాన్స్ నుంచే ఎక్కువ విషెష్.!

పూజాకు ఈ ముగ్గురి హీరోల ఫ్యాన్స్ నుంచే ఎక్కువ విషెష్.!

Published on Oct 13, 2020 4:02 PM IST

ఈరోజు మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పుట్టిన రోజు కావడంతో ఇతర సెలెబ్రెటీలు సహా ఆమె అభిమానులు కూడా ఆమెకు సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో పూజా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన మేకర్స్ కూడా ఆమె లుక్ ను రివీల్ చేసారు.

అలా చేసిన వాటిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటిస్తున్న చిత్రం “రాధే శ్యామ్” ఒకటి. అయితే పూజాకు మాత్రం ఓ ముగ్గురు టాప్ హీరోల ఫ్యాన్స్ ఎక్కువగా విషెష్ తెలుపుతున్నారు. ఇప్పుడెలాగో ప్రభాస్ తో సినిమా చేస్తుంది కాబట్టి వారు ఎక్కువగానే చెప్తున్నారు.

అలాగే పూజ లేటెస్ట్ గా నటించి మెప్పించిన చిత్రం “అల వైకుంఠపురములో” కావడంతో బన్నీతో కనిపించి అలరించిన ఈ బుట్ట బొమ్మకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ విషెష్ తెలియజేస్తున్నారు. కానీ సూపర్ స్టార్ మహేష్ తో పూజా తీసింది ఒక సినిమాయే అయినా వారు కూడా అత్యధికంగా ప్రేమను కనబరుస్తున్నారు. వారు కూడా సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డే కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు