ఏప్రిల్‌ను ముగించనున్న చిన్న సినిమాలు

2025లో నాలుగు నెలలు పూర్తి కావస్తుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుండటంతో సినిమాలను రిలీజ్ చేసేందుకు పెద్ద హీరోలు ఆసక్తిని చూపడం లేదు. దీంతో చిన్న సినిమాలే బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇందులో భాగంగా ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాలే తమ జోరు చూపించేందుకు వస్తున్నాయి. హీరో ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ ‘సారంగపాణి జాతకం’ ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.

ఇక మరో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేసిన చిత్రం ‘చౌర్య పాఠం’. అందరూ కొత్తవాళ్లు నటిస్తున్న ఈ సినిమా క్రైమ్ నేపథ్యంలో సాగే కథతో వస్తోంది. ఈ సినిమాను కూడా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మలయాళ డబ్బింగ్ చిత్రం ‘జింఖానా’ కూడా అదే రోజున వస్తోంది. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కంటెంట్ బాగుంటే, ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. ఇలా ఏప్రిల్ నెలను ఈ మూడు చిన్న సినిమాల రిలీజ్‌తో ముగించనున్నాయి.

Exit mobile version