సినీ రంగానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పాపులర్ అవార్డ్స్ లో ఆస్కార్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ అవార్డు ఇండియన్ సినిమాకి RRR తో మరింత చేరువైంది. ఇక అక్కడ నుంచి అనేకమంది ఫిలిం మేకర్స్ ఆస్కార్ టార్గెట్ గా కూడా పని చేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఇంకోపక్క ఇండియన్ సినిమా నుంచి ఎపుడు లానే పలు సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ కోసం ఇండియన్ సినిమా ఫిలిం ఫెడరేషన్ తరపున ఎంపికై వెళ్తాయని తెలిసిందే.
అలా ఈసారి లిస్ట్ ఒకటి బయటికి వచ్చింది. మరి ఈ లిస్ట్ లో పలు ఆసక్తికర సినిమాలే ఉన్నాయి. వెంకీ మామ సెన్సేషనల్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 అలాగే సుకుమార్ కూతురు నటించిన గాంధీ తాత చెట్టు, అలాగే మంచు విష్ణు డివోషనల్ చిత్రం కన్నప్ప ఇంకా శేఖర్ కమ్ముల, ధనుష్ ల కుబేర చిత్రాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. మరి ఈ నామినీస్ లో ఏ సినిమా ఆస్కార్ ఎంపిక వరకు వెళుతుందో చూడాలి.