ఆగస్టు రెండో వారంలో వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కూలీ’. సినీ ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ చిత్రం ‘వార్2’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
అమెజాన్ ప్రైమ్ :
అంధేరా (హిందీ సిరీస్) ఆగస్టు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
సారే జహాసే అచ్చా (హిందీ మూవీ) ఆగస్టు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
టెహ్రాన్ (హిందీ చిత్రం)ఆగస్టు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (మలయాళం) ఆగస్టు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
కోర్ట్ కచేరీ (హిందీ సిరీస్) ఆగస్టు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షో :
సర్ (హిందీ సిరీస్) ఆగస్టు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.