నితిన్ సినిమాపై కొనసాగుతున్న సస్పెన్స్.!

నితిన్ సినిమాపై కొనసాగుతున్న సస్పెన్స్.!

Published on Sep 13, 2020 12:02 PM IST

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తన లేటెస్ట్ చిత్రం “భీష్మ” తో మంచి సాలిడ్ కం బ్యాక్ హిట్ ను అందుకున్నారు. అలాగే ఈ చిత్రం తర్వాత కూడా నితిన్ చేతిలో మరిన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఆ చిత్రాలు అన్ని కూడా మంచి హైప్ ను తెచుకొన్నవే కావడం విశేషం. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం “అంధధూన్” రీమేక్ లో నితిన్ నటించనున్న సంగతి అందరికీ తెలిసిందే.

మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న ఈ చిత్రం విషయంలో మాత్రం మొదటి నుంచి ఒక సస్పెన్స్ అలా కొనసాగుతూ వస్తుంది. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన టబు రోల్ కు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త పేరు వినిపిస్తూనే ఉంది. అలా గత కొన్ని రోజుల కితం ఈ రోల్ కు గాను సీనియర్ నటి రంభ పేరు వినిపించగా ఇప్పుడు ఈ పాత్రకు గాను మరో సీనియర్ నటి శ్రేయ శరన్ పేరు వినిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ రోల్ విషయంలో పెద్ద సస్పెన్సే నెలకొంది. మరి ఇది ఎప్పుడు వీడనుందో చూడాలి.

తాజా వార్తలు