సీతమ్మ వాకిట్లో .. అంజలినే సీత

సీతమ్మ వాకిట్లో .. అంజలినే సీత

Published on Dec 17, 2012 8:42 AM IST

anjali
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర ఎవరిదా అని షూటింగ్ మొదలైన రోజు నుండి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంజలిదే సీత పాత్ర అని నిన్న జరిగిన ఆడియో వేడుకలో వేడుకలో ఆమే రివీల్ చేసారు. సినిమాలో పెద్దోడు వెంకటేష్ భార్యగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర సినిమాకి ఎంతో కీలకం. మహేష్ బాబుకి జోడీగా సమంతా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, జయసుధ తల్లితండ్రులుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆడియో వేడుక వెంకటేష్, మహేష్ అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు వచ్చిన అందరు ప్రముఖులు చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు