పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ హారర్ చిత్రమే “ది రాజా సాబ్”. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ ని ఈ ఏడాది డిసెంబరుకి లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ డేట్ నుంచి జనవరి నెలకి వెళుతుందని కూడా బజ్ ఉంది. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ పై స్వయంగా నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఓపెన్ అయ్యారు.
తాము సినిమాని జనవరి 9 రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సంక్రాంతి సీజన్ కాబట్టి అప్పుడు బాగుంటుంది అని అనుకుంటున్నారట. సో డిసెంబర్ 5 స్లాట్ ఖాళీ అయినట్టే అని చెప్పాలి. అలాగే ఈ డేట్ లో బాలయ్య సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా “అఖండ 2” వస్తుందనే బజ్ కూడా చాలా రోజులు నుంచి ఉంది. సో దీనిపై కూడా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇది వరకు పార్ట్ 1 కూడా డిసెంబర్ మొదటి వారంలోనే వచ్చి అఖండ విజయం సాధించింది.