‘బ్యూటీ’ చాలా గొప్ప చిత్రంగా నిలుస్తుంది – ప్రీ రిలీజ్ లో దర్శకుడు మారుతి

‘బ్యూటీ’ చాలా గొప్ప చిత్రంగా నిలుస్తుంది – ప్రీ రిలీజ్ లో దర్శకుడు మారుతి

Published on Sep 14, 2025 11:30 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ మారుతి, ఎస్ కే ఎన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..

ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ .. “మా ప్రతీ సినిమా ఆడిందంటే దానికి కారణం ఎస్ కే ఎన్. ‘ఈరోజుల్లో’ మూవీకి ఎస్ కే ఎన్, శ్రేయాస్ శ్రీనివాస్ సపోర్ట్ చేశారు. ఆ రోజు వాళ్లిద్దరూ లేకుంటే నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉండేవాడ్ని కాదు. సుబ్బు మాకు ఎప్పుడూ క్రైమ్ కథలు చెబుతుండేవారు. కానీ ఓ పాయింట్‌ను సుబ్బు చెప్పాడు. ఆ కథ నాకు నచ్చింది. కానీ మా గ్రూపులో మాత్రం ఎవ్వరూ నమ్మలేదు. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఆ ఫాదర్ ఫీలింగ్‌ను పేపర్ మీద పెట్టారని నాకు అనిపించింది. ఆ కథను నిమ్మకాయల ప్రసాద్ గారు విని ఎగ్జైట్ అయ్యారు. మేం చెప్పిన మార్పులు, చేర్పులతో ఆ కథను మాకు సుబ్బు ఇచ్చేశాడు. అప్పటికే సాయి బాధల్లో ఉన్నాడు. అందుకే పిలిచి ఈ కథను ఇచ్చాను. సాయి కుమార్ మంచి విజువల్స్ ఇచ్చారు. విజయ్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మదర్ కారెక్టర్‌లో వాసుకి గారు జీవించారు. వాసుకి గారు, నరేష్ గారు చేసిన పర్ఫామెన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్‌లు ఎమోషనల్ అయ్యారు. ఒరిస్సా నుంచి వచ్చిన నీలఖి అద్భుతంగా నటించారు. సినిమా చూసిన తరువాత హీరో హీరోయిన్లు ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతారు. అంకిత్ మంచి యాక్టర్ అని మరోసారి రుజువు అవుతుంది. సినిమాలో దమ్ముంది కాబట్టే.. ఈ రోజు ఇక్కడ మేం ఇలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. ‘బ్యూటీ’ చాలా గొప్ప సినిమా. ప్రతీ తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తోంది. ప్రస్తుతం ‘లిటిల్ హార్ట్స్’ బాగా ఆడుతోంది.. ‘మిరాయ్’ హిట్ అయింది.. ఇప్పుడు ‘బ్యూటీ’ వస్తోంది.. ‘ఓజీ’ ఎలా ఉండోబోతోందో నాకు తెలుసు.. మధ్యలో ‘బ్యూటీ’ని చూడండి. ఆడపిల్లల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలతో, యథార్ఘ సంఘటనలతో ‘బ్యూటీ’ కథను రాశారు. సెప్టెంబర్ 19న థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

ఇక మాస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ .. ‘సెప్టెంబర్ నెలలో ‘లిటిల్ హార్ట్స్’, ‘మిరాయ్’, ‘కిష్కింధపూరి’ ఆడుతున్నాయి. తరువాత ‘బ్యూటీ’ వస్తుంది.. ఆపై తుఫాన్ ‘ఓజీ’ వస్తుంది. మామూలు టికెట్ రేట్లతో సినిమాలు వస్తే జనాలు థియేటర్లకు వస్తున్నారని సినీ పెద్దలు గుర్తించాలి. ‘బ్యూటీ’ కథ నాకు చాలా ఇష్టం. జర్నలిస్ట్‌గా సుబ్బు గారు మా గ్రూపులో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఆయనలాంటి వారు ‘బ్యూటీ’ లాంటి కథను చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ‘బ్యూటీ’ కథ నా మనసుకి హత్తుకుంది. ప్రొడ్యూసర్స్ అంతా కూడా క్యాస్ట్ గురించి చూస్తారు.. కానీ ఆయన మాత్రం కంటెంట్‌లో టేస్ట్ చూస్తారు. విజయ్ పాల్ రెడ్డి గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. టైటిల్ మాత్రమే కాదు.. కథ కూడా ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంటుంది. పిల్లలు అడిగిందల్లా కొనివ్వలేని పేరెంట్స్ పడే మథనం గురించి అద్భుతంగా చూపించారు. వర్దన్ మేకింగ్ బాగుంది. అంకిత్ పర్ఫామెన్స్ నాకు చాలా ఇష్టం. నీలఖి ఒరిస్సా అమ్మాయి అయినా మన తెలుగు లెక్కే. ‘బ్యూటీ’తో ఆమెకు మంచి బ్రేక్ రావాలి. ‘బేబీ’తో మేం విజయ్ బుల్గానిన్‌కు లైఫ్ ఇవ్వలేదు.. ఆయన మ్యూజిక్ ‘బేబీ’కి లైఫ్ ఇచ్చింది. విజయ్ ఎంత ఎదిగినా కూడా ఇంకా కాకినాడలోనే మ్యూజిక్ చేస్తున్నారు. వాసుకి గారిని చూస్తే ఎంతో డిగ్నిటీగా అనిపిస్తారు. ఆమె చేసిన పాత్రలన్నీ కూడా మన కుటుంబాల్లోని ఓ పాత్రలానే ఉంటుంది. నిమ్మకాయల ప్రసాద్ గారు జీ నుంచి ఎన్నో గొప్ప తెలుగు సినిమాల్ని తీసుకు వచ్చారు. నరేష్ గారు వాటర్ లాంటివారు. ఏ పాత్రలో అయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారు. ఇప్పుడు అసిస్టెంట్‌గా పని చేసిన వారు నెక్ట్స్ సినిమాకి డైరెక్టర్ అవ్వాలని అనుకునే వారిలో మారుతి గారు, సుకుమార్ గారు ముందుంటారు. సెప్టెంబర్ 19న ‘బ్యూటీ’ చిత్రం రాబోతోంది. 18న పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. అమీర్ పేట్‌ AAA లో నేను ఫ్రీ షో వేయిస్తాను. ఓ అమ్మాయి.. తన ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఆ షోని చూడొచ్చు’ అని అన్నారు.

యంగ్ హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ .. “వర్దన్ గారికి మారుతి గారు రెండో అవకాశం ఇచ్చారు. సక్సెస్ లేనప్పుడు కూడా మారుతి గారు లాంటి వారు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుంటారు. నన్ను నమ్మి నాకు ఇంత మంచి సినిమాను ఇచ్చిన మారుతి గారికి థాంక్స్. ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ థియేటర్‌ విజిట్‌కు వెళ్తే.. ‘తిమ్మరుసు’, ‘ఆయ్’లో చేసింది నువ్వేనా? అని అడిగారు. మంచి చిత్రాలు చేస్తున్నావ్ అంటూ ఆ పెద్దాయన అన్న మాటలు నాలో ఎంతో స్పూర్తిని నింపాయి. మంచి పాత్రలు, మంచి చిత్రాలు చేసుకుంటూ వెళ్తే.. ఆడియెన్స్ మనల్ని హీరోని చేస్తారని నాకు అర్థమైంది. ‘బ్యూటీ’ చిత్రం ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు. నా పేరు అంకిత్ కొయ్య.. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న ప్రొడక్ట్.. కానీ మినిమం గ్యారెంటీ.. జర్నలిస్ట్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం గారు ఈ కథను రాశారు. సెప్టెంబర్ 19న ‘బ్యూటీ’ చిత్రం రాబోతోంది. ఒక్కసారి వచ్చి సినిమా చూడండి.. నచ్చకపోతే సున్నా రేటింగ్ ఇవ్వండి.. నచ్చితే మాత్రం ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లండి’’ అని తెలిపాడు.

దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్దన్ మాట్లాడుతూ.. ‘‘బ్యూటీ’ సినిమా ప్రతీ ఒక్కరినీ సీటులో కూర్చోబెడుతుంది. నాకు రెండో ఛాన్స్ ఇచ్చిన మారుతి గారు నాకు డెమీ గాడ్. నాకు నిమ్మకాయల ప్రసాద్ గారు గురువులాంటి వారు. సుబ్రహ్మణ్యం గారి కథ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని కథ విన్న వెంటనే నిమ్మకాయల ప్రసాద్ గారు ముందుగా నమ్మారు. మా రైటర్స్, అంకిత్‌తో కలిసి ఓ ఐదు రోజులు పని చేసి పూర్తి స్క్రిప్ట్, కథను రెడీ చేశాను. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి గారికి మేం చేసిన మార్పులు చేర్పులు నచ్చాయి. ఓ హీరో ఓ మూవీని భుజానికి ఎత్తుకుని చేస్తే ఎలా ఉంటుందో.. బ్యూటీ అలా ఉంటుంది. ఈ సినిమాకు అంకిత్ చాలా కష్టపడ్డారు. విజయ్ బుల్గానిన్ పాటలు ఒకెత్తు అయితే.. ఆర్ఆర్ ఇంకో ఎత్తు. సినిమా చూసిన తరువాత విజయ్ ఇచ్చిన ఆర్ఆర్ అందరినీ కదిలిస్తుంది. సాయి కుమార్ ఇచ్చిన విజువల్స్ ఈ మూవీకి ప్రధాన బలం. ప్రతీ డీటైలింగ్‌ను చూపించాం. నా రైటర్స్ దేవ్, ప్రశాంత్ గారికి థాంక్స్. నరేష్ గారు కథకు, డైరెక్టర్‌కు సరెండర్ అవుతారు. వాసుకి గారు మన అందరి గుండెల్లో ఉండిపోయారు. నీలఖి చాలా బాగా నటించారు. సెప్టెంబర్ 19న రాబోతోన్న ‘బ్యూటీ’ చిత్రం అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు.

ఇక నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల మాట్లాడుతూ .. ‘వందల కోట్లు సంపాదించాలని వానరా సెల్యూలాయిడ్‌ను ప్రారంభించలేదు.. మంచి చిత్రాల్ని నిర్మించాలని ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను తీసిన గత చిత్రం కూడా మంచిదే. ఓటీటీలోకి వచ్చిన తరువాత ఆ విషయం తెలుస్తుంది. ‘కన్నమ్మ’ అనేది అంకిత్ పర్సనల్ సాంగ్ కాదు.. అది మా ‘బ్యూటీ’ చిత్రంలోనిది. ‘బ్యూటీ’ని మీడియా వాళ్లు ఆడియెన్స్ వరకు రీచ్ చేయండి. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన కథను వర్దన్ గారు అద్భుతంగా తీశారు. మా కోసం వచ్చిన మారుతి గారు, ఎస్.కే.ఎన్ గారికి థాంక్స్. నరేష్ గారు, వాసుకి గారు, అంకిత్ గారు ఇలా అందరూ అద్భుతంగా నటించారు. సెప్టెంబర్ 19న ‘బ్యూటీ’ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ* .. ‘తెలుగు సినీ చరిత్రలో దాసరి గారి టీం నుంచి ఎక్కువ మంది దర్శకులు ఇండస్ట్రీలోకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు మారుతి గారి టీం నుంచి ఎక్కువ మంది దర్శకులు వస్తున్నారు. ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు మొదటి సారిగా మారుతి గారితో పని చేశాను. ఆ తరువాత మళ్లీ నాకు కామెడీ చిత్రాలు వచ్చాయి. ఎస్.కే.ఎన్ గారు అద్భుతమైన సినిమాలు నిర్మిస్తున్నారు. సుబ్బు, సాయి, వర్దన్ ఈ సినిమాకు సూర్యచంద్రులు. ప్రతీ ఇంట్లో జరిగే కథను అద్భుతంగా మలిచారు. ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతంగా తీశారు. కథ చెప్పినప్పుడే ఎంతో ఇన్‌స్పైర్ అయ్యాను. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ మూవీకి రెండు కళ్లు. మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంది. ఆర్ఆర్ చూసిన తరువాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. సాయి కుమార్ విజువల్స్ అదిరిపోయాయి. ప్రతీ ఎమోషన్‌ను లైటింగ్ ద్వారానే చూపించాడు. ఈ మూవీలో నటించడం నాకు గర్వకారణం. నీలఖిని చూసిన తరువాత ఈ మూవీ హిట్ అని అనిపించింది. వాసుకి ఇంటెలిజెంట్ యాక్టర్. అంకిత్‌ను ఈ మూవీలో చూసి సర్ ప్రైజ్ అవుతారు. పాత్రని నటనతో చింపేశాడు. ‘బ్యూటీ’ కన్నులపండుగగా ఉంటుంది. ఈ మూవీ ఎమోషన్స్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి గారికి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. సెప్టెంబర్ 19న బ్యూటీ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

హీరోయిన్ నీలఖి మాట్లాడుతూ .. ‘మేం తెలుగు వాళ్లమే. కానీ ఒడిస్సాలో సెటిల్ అయ్యాం. తెలుగు కల్చర్ నాకు కొత్తేమీ కాదు. నాకు ‘బ్యూటీ’ మొదటి చిత్రం. ఇందులో నేను అలేఖ్య పాత్రను పోషించాను. నా పాత్రలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. నాకు అర్థమయ్యేలా చెప్పి నటించేలా చేసిన వర్దన్ గారికి థాంక్స్. నరేష్ గారు, వాసుకి మేడం, అంకిత్ గారు నాకు ఎంతో సహకరించారు. సెప్టెంబర్ 19న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నిమ్మకాయల ప్రసాద్ మాట్లాడుతూ* .. ‘‘బ్యూటీ’ సినిమాను ముందుగా మీడియా చూడండి. మీరే ఎలా ఉందో ఆడియెన్స్‌కి చెప్పండి. ఈ మూవీ చాలా గొప్పగా వచ్చింది. జీ స్టూడియోలో ఇదే నా చివరి చిత్రం. సుబ్బు కథ చెబుతుంటే.. ఇంటర్వెల్‌కే క్లైమాక్స్‌లా అనిపించింది. సగం కథ విని ఓకే చెప్పాను. ఇంటర్వెల్ చూసిన తరువాత ఆడియెన్‌కి కచ్చితంగా తమ తండ్రి గుర్తుకు వస్తారు. క్లైమాక్స్ తరువాత కచ్చితంగా మీ తండ్రికి ఫోన్ చేస్తారు. డైరెక్టర్, డీఓపీ లవర్స్ అయితే సినిమా ఎంత బాగా వస్తుందో ‘బ్యూటీ’ ఉదాహరణ. డైరెక్టర్ వర్దన్, డీఓపీ సాయి ఈ మూవీని అద్భుతంగా తీశారు. నీలఖి చాలా బాగా నటించారు. వాసుకి గారిని మళ్లీ ఇలా చూడటం ఆనందంగా ఉంది. అంకిత్ గారు చాలా చక్కగా నటించారు. నరేష్ గారితో మా జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. సెప్టెంబర్ 19న ‘బ్యూటీ’ చిత్రాన్ని చూడండి. ఏ ఒక్కరినీ నిరాశ పర్చదని మాత్రం కచ్చితంగా చెప్పగలను’ అని అన్నారు.

అలాగే కథ, స్క్రీన్ ప్లే రైటర్ ఆర్.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ .. ‘నన్ను నమ్మిన మా మెంటర్ మారుతి గారికి థాంక్స్. నేను జర్నలిస్ట్‌గా పని చేసినప్పుడు టీనేజ్ అమ్మాయిలు ఇంట్లోంచి పారిపోయే కేసులు ఎక్కువగా చూశాను. అదే పాయింట్‌ను మారుతి గారికి చెప్పాను. ఆ తరువాత నిమ్మకాయల ప్రసాద్ గారికి వినిపించమని చెప్పారు. కథ సగం విన్న వెంటనే ఆయన ఓకే చెప్పారు. ఈ కథకి సంక్లిష్టత, సంఘర్షణను మారుతి గారు అద్భుతంగా యాడ్ చేశారు. నరేష్ గారు ఎప్పుడూ పోషించనటువంటి పాత్రను పోషించారు. మారుతి గారు ఇప్పటి వరకు దాదాపు 15,16 మంది డైరెక్టర్లు, రచయితలకు అవకాశం ఇచ్చారు. ఇది ఆల్ టైం రికార్డ్. సాయి కుమార్ మంచి విజువల్స్ ఇచ్చారు. అంకిత్ అద్భుతంగా నటించారు. నీలఖి కూడా చక్కగా నటించారు. వాసుకి గారిని ఇందులో చూడటం ఆనందంగా ఉంది. విజయ్ పాల్ రెడ్డి గారికి కథ చెప్పిన వెంటనే ఓకే చేశారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అంటే ఓ మత్తులాంటిది. సెప్టెంబర్ 19న ‘బ్యూటీ’ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని తెలిపారు.

సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. ‘మారుతి గారు ఫోన్ చేసి ఓ కథ వినమని అన్నారు. నచ్చితేనే చేయమని అన్నారు. నచ్చితే కాదు.. మీరు చెబితే చేస్తాను అని మారుతి గారితో అన్నాను. ‘బ్యూటీ’ కథ విన్న వెంటనే చాలా నచ్చింది. నాకు ఇందులో ఛాన్స్ ఇచ్చిన నిర్మాత విజయ్ గారికి థాంక్స్. నరేష్ గారు, వాసుకి గారు, అంకిత్, నీలఖి అందరూ అద్భుతంగా నటించారు. సెప్టెంబర్ 19న రాబోతోన్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు.

జీ స్టూడియోస్ ప్రతినిధి దివ్య మాట్లాడుతూ .. ‘మంచి కథతో ‘బ్యూటీ’ రాబోతోంది. అందరూ చూడవల్సిన చిత్రం. ఈ మూవీ సెప్టెంబర్ 19న రాబోతోంది. మాకు సపోర్ట్ చేసిన మారుతి గారికి, ఇక్కడకు వచ్చిన ఎస్.కే.ఎన్ గారికి థాంక్స్’ అని అన్నారు.

తాజా వార్తలు