చిరంజీవి సినిమాలో ‘మాస్టర్’ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చేసింది!

Chiranjeevi-malavika-mohana

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తుండగా వాటిలో ఇంకా మొదలు కానున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది. తన వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో లో చేస్తున్న భారీ సినిమా కోసం ఇప్పుడు రంగం సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమాలో మాస్టర్, లేటెస్ట్ గా ది రాజా సాబ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఉన్నట్టుగా ఈ మధ్య అంతా వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇక ఈ రూమర్స్ పై స్వయంగా మాళవిక స్పందించింది. తన వరకు ఈ రూమర్స్ వచ్చాయి. అని మెగాస్టార్ తో సినిమా చేయడం స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా కెరీర్ లో ఒక ఐకానిక్ అంశం కానీ ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తనని ఎవరూ సంప్రదించలేదు అని అసలు క్లారిటీ ఇచ్చింది. సో అందరికీ ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

Exit mobile version