కెరీర్ లో మొదటిసారి పవన్ కళ్యాణ్ లాయర్ రోల్ చేస్తున్నారు. అలాగే కమర్షియల్ మూవీస్ కి భిన్నంగా చేస్తున్న సబ్జెక్టు కూడా ఇదే. గతంలో పవన్ సినిమాలో సామాజిక సందేశం ఉన్నపప్పటికే, కమర్షియల్ అంశాలే అధికంగా ఉండేవి. వకీల్ సాబ్ మాత్రం ఓ ఎమోషనల్ సోషల్ సబ్జెట్ తో వస్తుంది. అంటే వకీల్ సాబ్ చిత్రంలో పూర్తిగా ఓ కొత్త పవన్ కళ్యాణ్ ని ప్రేక్షకులు చూడబోతున్నారు. కాగా ఈ మూవీలో అలరించే మరో అంశం కోర్ట్ రూమ్ సన్నివేశాలు.
అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కున్న ముగ్గురు అమ్మాయిలను కాపాడే క్రమంలో ఓ లాయర్ చేసే పోరాటమే లాయర్ సాబ్ మూవీ కాగా..లాయర్ గా పవన్ నటన పతాక స్థాయిలో ఉంటుందట. వారిని కాపాడడానికి పవన్ లేవనెత్తే సున్నితమైన అంశాలు, ఆలోచింపజేసేవిగా ఉంటాయట. చివరి అరంగంట కోర్ట్ రూమ్ సన్నివేశాలలో పవన్ ని కాకుండా కేవలం ఓలాయర్ ని చూస్తారట ప్రేక్షకులు.