ఓవర్సీస్‌లో గర్ల్‌ఫ్రెండ్ హవా.. మామూలుగా లేదుగా..!

ఓవర్సీస్‌లో గర్ల్‌ఫ్రెండ్ హవా.. మామూలుగా లేదుగా..!

Published on Nov 12, 2025 2:00 AM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ రన్ కొనసాగిస్తోంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రంలో రష్మిక తన స్టెల్లర్ పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.

ఇలాంటి సినిమాలు చాలా అవసరం అంటూ యావత్ ప్రేక్షక లోకం ఈ సినిమాకు కనెక్ట్ అవుతుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ దుమ్ములేపుతోంది. తాజాగా ఈ చిత్రం నార్త్ అమెరికాలో $475K+ గ్రాస్ వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్ సాధించడం రష్మిక కెరీర్‌లో మరో ఘనతగా నిలిచింది.

రష్మిక నటన, మ్యూజిక్‌, స్క్రీన్‌ప్లే అన్నీ కలిసి సినిమాకు బలమైన హైలైట్‌లుగా నిలిచాయి. దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ధీరజ్ మోగిలేన్ నిర్మించారు.

తాజా వార్తలు