మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసుకొని మళ్ళీ సంక్రాంతి రేస్ ని తన కైవసం చేసుకోవడానికి అనీల్ రావిపూడి సిద్ధం అయ్యినట్టు ఫస్ట్ సింగిల్ తో చెప్పకనే చెప్పారు. అయితే ఈ సాంగ్ తర్వాత మరో సాంగ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.
దీని ప్రకారం ఓ గ్లామర్ నెంబర్ ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో పాటుగా ఈ సాంగ్ కోసం మేకర్స్ మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకొస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఇక ఈ సినిమాలో వెంకీ మామ కూడా సాలిడ్ క్యామియో రోల్ చేస్తుండగా నిర్మాత సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.


