ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న ‘ఇడ్లీ కొట్టు’

ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న ‘ఇడ్లీ కొట్టు’

Published on Nov 12, 2025 1:00 AM IST

Idli-Kottu

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘ఇడ్లీ కడై’(తెలుగులో ఇడ్లీ కొట్టు) చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

కాగా, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కొద్ది రోజుల్లోనే గ్లోబల్ ట్రెండింగ్ లిస్ట్‌లో రెండో స్థానానికి చేరింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలు, సహజమైన కథనం, ధనుష్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో ధనుష్ తన పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్రఖని, షాలినీ పాండే, ఆర్.పార్థీబన్, రాజ్‌కిరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు