ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘రొమాంటిక్’. యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ కు సంబంధించిన ఫ్యాచ్ వర్క్ షాట్స్ ను గత రెండు వారాల నుండి చిత్రబృందం తెరకెక్కించిందట. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హీరో రామ్ వాయిస్ ఓవర్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి.
గత చిత్రం ‘మెహబూబా’ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు ఆకాష పూరి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు