చిత్తూరులో షూటింగ్ జరుపుకుంటున్న ‘ది బ్రెయిన్’

చిత్తూరులో షూటింగ్ జరుపుకుంటున్న ‘ది బ్రెయిన్’

Published on Nov 1, 2025 12:39 PM IST

సస్పెన్స్‌, క్రైమ్‌ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల మద్దతు ఉంటుంది. అలాంటి కథాంశంతో ఎండ్లూరి ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌పై ఎండ్లూరి కళావతి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ది బ్రెయిన్’. ఈ సినిమాకు అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్, తన్విక, బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయ చంద్ర నాయుడు, రవి కాలే, జ్యోతి వంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

దర్శకుడు అశ్విన్ కామరాజ్ కొప్పాల మాట్లాడుతూ.. “ది బ్రెయిన్‌ను క్రైమ్‌ అండ్‌ సస్పెన్స్‌ జానర్‌లో తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఆధారంగా చేసుకుని కథను రూపకల్పన చేశాం. రచయిత పోతు గడ్డం ఉమా శంకర్ గారి మాటలు, యూఎస్ విజయ్ కెమెరా వర్క్‌, ఎంఎల్ రాజా సంగీతం కలగలిసి సినిమాకు మంచి బలం అందిస్తున్నాయి” అని తెలిపారు.

ఇక వీలైనంత త్వరగా ఈ చిత్ర షూటింగ్ ముగించుకుని విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు