ఆ హీరోను అలా పిలుస్తాను – కీర్తి సురేశ్

ఆ హీరోను అలా పిలుస్తాను – కీర్తి సురేశ్

Published on Feb 3, 2025 6:59 AM IST

మలయాళ స్టార్ హీరో దిలీప్‌ కి, హీరోయిన్ కీర్తి సురేశ్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. కారణం.. గతంలో దిలీప్‌ హీరోగా వచ్చిన ఓ సినిమాలో అతని కూతురు పాత్రలో కీర్తి సురేష్ నటించినట్లు ఆమె తాజాగా తెలిపారు. ఆ సినిమా తర్వాత దిలీప్‌ కి, హీరోయిన్ కీర్తి సురేశ్ కి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. అప్పటి నుంచి ఆయనను కీర్తి సురేష్ అంకుల్ అని పిలుస్తోందట. చిన్నతనం నుంచి దిలీప్‌ ని అలా అంకుల్ అని పిలిచి, ఆ తర్వాత ఆయన పక్కనే హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది.

ఇదే విషయం గురించి తాజాగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘కూతురి పాత్ర చేసిన కొన్నేళ్లకు దిలీప్ సరసన గర్ల్ ఫ్రెండ్ రోల్‌ లో నటించాను. ఆ సమయంలో ఎప్పటిలాగే నేను దిలీప్ ను అంకుల్ పిలిచేదాన్ని. అప్పుడు ఆయనకు అది నచ్చలేదు. అంకుల్ అని కాకుండా అన్నయ్య అని పిలవాలని దిలీప్ నాకు చెప్పారు. అప్పటి నుంచి నేను ఆయనను అన్నయ్య అనే పిలుస్తాను’ అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు