నాకిచ్చిన వాటిల్లో అదే బెస్ట్

నాకిచ్చిన వాటిల్లో అదే బెస్ట్

Published on Nov 7, 2012 4:47 PM IST


‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ. ఇప్పటివరకూ నటించిన సినిమాల్లోని తన నటనకి మరియు గ్లామర్ కి చాలా చాలా కాంప్లిమెంట్స్ అందుకొని ఉంటారు. కానీ తనకి మాత్రం ఒకే ఒక్క కాంప్లిమెంట్ అంటే మాత్రం తనకి బాగా ఇష్టం అని అంటోంది. అదేంటో తాప్సీ మాటల్లోనే ‘ నా మొదటి సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నాకొక కితాబునిచ్చారు. అది నేను నా లైఫ్ లో ఎప్పుడూ మరిచిపోను మరియు అది నాకు చాలా ఇష్టమైనది అని’ ఆమె అన్నారు.

ఇంతకీ రాఘవేంద్ర రావు గారు ఏమన్నారంటే నేను ఇప్పటి వరకూ పనిచేసిన అందమైన భామల్లో తను కూడా ఒకటని ఆయన అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తాప్సీనే ఒక ప్రముఖ పేపర్ కి తెలిపారు. ప్రస్తుతం తాప్సీ వెంకటేష్ సరసన ‘షాడో’, గోపి చంద్ తో ఒక సినిమా మరియు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్లో విడుదల కానున్న ‘గుండెల్లో గోదారి’ సినిమాలో నటించింది. అందం గురించి చెప్పడంలో డైరెక్టర్ రాఘవేంద్ర రావు మంచి జడ్జ్ మెంట్ ఉంది కనుక తాప్సీ అందగత్తె అని చెప్పారు.

తాజా వార్తలు