హీరోయిన్లను ఆ విధంగా చూస్తారట

హీరోయిన్ మాళవికా మోహనన్‌ కి రీసెంట్ గా ‘తంగలాన్‌’ సినిమాతో మంచి హిట్ వచ్చింది. ప్రస్తుతం ‘రాజా సాబ్‌’, ‘సర్దార్‌ 2’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా దృష్టి పెడతారు అంటూ క్రేజీ కామెంట్స్ చేసింది. ఇంతకీ, మాళవికా మోహనన్‌ ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే… ‘దక్షిణాది సినిమాల్లో నేను నటిస్తున్నాను. ఆ సినిమాల గురించే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను’ అని మాళవికా మోహనన్‌ చెప్పుకొచ్చింది.

‘ముఖ్యంగా నేను ముంబైలో పెరిగా కాబట్టి, దక్షిణాది సినిమాల గురించి నా కెరీర్ మొదట్లో నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ, దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా ఇష్టపడతారు అని ఆ తర్వాత అర్ధం అయింది. నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. హీరోయిన్ల ఫొటోలు చూసేటప్పుడు కూడా వారి శరీర భాగాలను జూమ్ చేసి మరీ చూస్తారు. అందులోనూ నాభిని ఎక్కువగా చూస్తారు’ అంటూ మాళవికా మోహనన్‌ తెలిపింది.

Exit mobile version