మన తెలుగు తెరకు కొత్తగా పరిచయం అయిన హీరోల్లో మోస్ట్ టాలెంటడ్ హీరో సత్య దేవ్ కూడా ఒకరు. ఇప్పటి వరకు చాలా రోల్స్ చేసిన ఈ హీరో లేటెస్ట్ గా “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య” చిత్రంతో మంచి బ్రేక్ అందుకున్నాడు. అయితే సత్యదేవ్ ఇప్పటికే ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో కనిపించాడు. కానీ నిజ జీవితంలో మాత్రం ఎదుర్కొన్న ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం ద్వారా పంచుకున్నారు. ఈ అనుభవాన్ని కనుక విన్నట్టయితే అదంతా ఒక సినిమా రేంజ్ డ్రామాలా అనిపిస్తుంది.
సత్యదేవ్ ఒక హిందీ సినిమా షూటింగ్ నిమిత్తం “ఆఫ్ఘనిస్తాన్” వెళ్లాల్సి రాగా అక్కడ మొదటి రోజు చిన్న షూట్ ను ప్లాన్ చేశారు. జస్ట్ క్యాజువల్ వాక్ తో ప్లాన్ చేసారు. ఆఫ్ఘన్ లోని ఒక పేరు మోసిన ప్రాంతం దగ్గర షూట్ ప్లాన్ చేసారు. అయితే అక్కడ వాళ్ళ దురదృష్టం ఏమిటంటే షూటింగ్ జరుగుతుంది అని తెలియని రీతిలో ప్లాన్ చేసారు. ఇక షాట్ లో సత్య దేవ్ అలా అటు ఇటు తిరుగుతుంటే అతన్ని మానవ బాంబ్ అనుకోని పోలీసులు అతనితో పాటు ఒక అసిస్టెంట్ ని కూడా తీసుకెళ్లారట. సంకెళ్లు వేసేసి ఇద్దరినీ ఇంటరాగేట్ చేసారు.
గన్స్ పట్టుకుని ఎదురుగా ఉండి పాస్ పోర్ట్స్ చూపించమన్నారట సత్యదేవ్ షూట్ కాబట్టి కాస్ట్యూమ్ లో ఉండటం మూలాన పాస్ పోర్ట్ రూమ్ లో వదిలేసాడు. కానీ కెమెరా అసిస్టెంట్ తనది తన దగ్గరే ఉందని చెప్పాడట, అయితే చూపించమని అంటే అతను కాస్తా అతని సాక్స్ దగ్గర చెయ్యి పెడుతుండడం చూసి అలెర్ట్ అయిన ఆఫ్ఘన్ పోలీసులు గన్స్ లోడ్ చేసి టార్గెట్ చేశారట.
ఇక్కడ మళ్ళీ వీళ్ళ బ్యాడ్ లక్ ఏమిటంటే మానవ బాంబ్ పెట్టుకున్న వాళ్ళు కూడా ట్రిగర్ ను ఆ కాళ్ళ దగ్గరే పెట్టుకుంటారని అందుకు వారు అలా అలర్ట్ అయ్యారని ఇక నా జీవితంలో అదే ఆఖరి రోజు అన్న రేంజ్ లో అనిపించింది అని మమ్మల్ని చంపెయ్యడానికి వాళ్ళ దగ్గర అన్ని కారణాలు ఉన్నాయని సత్యదేవ్ ఆ అనుభవాన్ని పంచుకున్నాడు. తర్వాత రెండు దేశాల మధ్య పెద్ద మీటింగ్ తర్వాత ఆగి తిరిగి మళ్ళీ 45 రోజులు షూట్ చేశామని సత్యదేవ్ ఈ షో ద్వారా తెలిపారు.