దేశం వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న చిత్రాలలో ఆర్ ఆర్ ఆర్ ఒకటి. దర్శకుడు రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లతో మల్టీ స్టారర్ గా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ వేదికగా జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో అజయ్ దేవ్ గణ్ పాల్గొన్నారు. కాగా ఈ చిత్రంలో అల్లూరి, భీమ్ లకు యుద్ధ విద్యలు నేర్పి, పోరాట స్ఫూర్తి నింపే గురువుగా అజయ్ దేవ్ గణ్ కనిపిస్తాడని గట్టిగా వినిపిస్తుంది. ఐతే ఇలాంటి పాత్ర మెగాస్టార్ చిరంజీవి చేసి ఉంటే సినిమా రేంజ్ మరో స్థాయికి చేరేది అని టాలీవుడ్ టాక్.
వయసు రీత్యా మరియు ఇమేజ్ పరంగా కూడా చిరంజీవికి ఈ రోల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది. మరి రాజమౌళి అజయ్ దేవ్ గణ్ ని తీసుకోవడానికి కారణం బాలీవుడ్ మార్కెట్ కోసమే అని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ హిందీలో కూడా విడుదల అవుతుండగా అక్కడ మంచి ప్రచారం లభించాలంటే అక్కడ స్టార్ హీరో అయిన అజయ్ దేవ్ గణ్ ఆ పాత్రకు తీసుకోవడం కరెక్ట్ అని భావించి ఉండొచ్చు. ఇక ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది.