ఆ సినిమా పడితే ఎన్టీఆర్ ని ఆపడం కష్టమే..!

ఆ సినిమా పడితే ఎన్టీఆర్ ని ఆపడం కష్టమే..!

Published on May 2, 2020 8:16 AM IST

ఒక దశలో వరుస పరాజయాలతో ఇబ్బందిపడ్డ ఎన్టీఆర్ టెంపర్ మూవీ తరువాత సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో,జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వరుస విజయాలు అందుకున్నాయి. ఇక రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ పాన్ ఇండియా చేస్తూ ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా వార్తలలో నిలిచారు. ఇప్పుడు ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ రీత్యా తమిళ, కన్నడ పరిశ్రమలలో టాప్ డైరెక్టర్స్ గా ఉన్నవారు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కమిట్ అయ్యారు. కొద్దిరోజులలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. ఐతే భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ తో ఓ భారీ పీరియాడిక్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజయ్ బాలీవుడ్ బడా దర్శకులలో ఒకరు. దానికి తోడు ఆయన పీరియాడిక్ చిత్రాలు గ్రాండ్ గా తెరకెక్కించడంలో దిట్ట. మరి ఆయనతో కనుక ఎన్టీఆర్ మూవీ కుదిరితే ఎన్టీఆర్ ని ఆపడం కష్టమే. సౌత్ లోనే భారీ ఫాలోయింగ్ కలిగిన హీరోగా ఎన్టీఆర్ అవతరించే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు