“తండేల్”.. అక్కడ చైతు కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్!?

“తండేల్”.. అక్కడ చైతు కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్!?

Published on Feb 5, 2025 7:02 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన అవైటెడ్ ప్రేమ కథా చిత్రమే “తండేల్”. కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఇపుడు విడుదలకి రాబోతుంది. అయితే ఈ సినిమా చైతూ కెరీర్లోనే మంచి ఓపెనింగ్స్ ని ప్రామిస్ చేస్తుండగా ఇపుడు యూఎస్ మార్కెట్ లో నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకునేలా ఉందని తెలుస్తోంది.

మరి నార్త్ అమెరికా ప్రాంతంలో చైతూ సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన గత సినిమా లవ్ స్టోరీ కెరీర్ బెస్ట్ కాగా ఇపుడు దీనిని తండేల్ బీట్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొత్తానికి చైతు మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు