‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!

‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Aug 27, 2025 2:11 PM IST

Peddi Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతూ వస్తుంది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ లో సమ్మె మూలాన కొంచెం బ్రేక్ పడింది కానీ మళ్ళీ పెద్ది మేకర్స్ షూటింగ్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారట.

ఇలా తరువాతి షెడ్యూల్ ని వచ్చే మంగళవారం నుంచి మొదలు పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ మైసూరు పయనమయినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ షెడ్యూల్ లో మీర్జాపూర్ నటుడు దివ్యెందు శర్మ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు