అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’కి అదే టాక్.. కానీ

ManaShankaraVaraPrasadGaru-sankranthiki vasthunam

మన టాలీవుడ్ సినిమా దగ్గర వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఎంతగానో దగ్గరైన దర్శకుడు అనీల్ రావిపూడి. కామెడీ ప్రధానంగా తెరకెక్కించే తన సినిమాలు ఒకొక్కటి ఒకదాన్ని మించి హిట్స్ అయ్యాయి. ఇలా ఈ ఏడాదిలో సంక్రాంతికి వస్తున్నాం తో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొడితే నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అంటూ రాబోతున్నారు.

అయితే ఈ రెండు సినిమాలకి ఇపుడు సోషల్ మీడియాలో ఒకే లాంటి టాక్ వినిపిస్తుంది. చిరు సినిమా నుంచి వచ్చిన మీసాల పిల్ల ప్రోమోలో క్వాలిటీ లేదని పలు కామెంట్స్ సోషల్ మీడియాలో సినిమాని పూర్తిగా అవపోసన పట్టేసిన మేధావులు చేస్తున్నారు. మరి సరిగ్గా ఇదే తరహా కామెంట్స్ గతంలో సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ ప్రోమోలు కొన్ని విజువల్స్ చూసి కూడా అన్నారు.

కానీ సీన్ కట్ చేస్తే ఆ సినిమా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అల్టిమేట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ని కదిలిస్తే ఈ క్వాలిటీ లాంటివి వాటిపై చేస్తున్న కామెంట్స్ ఎందుకూ పనికిరావు.. సో అనీల్ రావిపూడి సినిమాల్లో క్వాలిటీ కంటే ఎంటర్టైన్మెంట్ తోనే అందరికీ సమాధానం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ సినిమాకి కూడా అదే అవుతుందేమో చూడాలి.

Exit mobile version