పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక్క సరైన స్ట్రైట్ సినిమా పడితే ఎలా ఉంటుందో దాని ఎఫెక్ట్ ఇపుడు “ఓజి” చూపిస్తుంది అని చెప్పాలి. సరిగా ప్లాన్ చేసుకొని దిగితే ఆ వసూళ్ల సంచలనం కూడా ఎలా ఉంటుందో అనే దానికి ఓజి ఉదాహరణ. భారీ అంచనాలు ఉన్న ఓజి చిత్రాన్ని యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆల్రెడీ 250 కోట్ల మార్క్ ని అందుకున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.
దాదాపు ఎన్నో ఏళ్ళు తర్వాత ఓజి చిత్రానికే మళ్ళీ వసూళ్లు పవన్ అంగీకారంతో అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఓజి చిత్రం డెఫినెట్ గా 300 కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ కానుంది అని గట్టిగా వినిపిస్తుంది. మెయిన్ గా దసరా రేస్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. పైగా వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ కూడా బుకింగ్స్ స్టడీ గానే కొనసాగుతూ ఉండడం అనేది విశేషం. సో ఈ కొన్ని రోజుల్లోనే ఓజి తో పవన్ కళ్యాణ్ 300 కోట్ల క్లబ్ లో చేరిపోతారని చెప్పవచ్చు.