నార్త్ అమెరికాలో సాలిడ్ వసూళ్లతో ‘కాంతార 1’

kantara chapter 1

కన్నడ టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రిషబ్ దర్శకత్వంలోనే తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే కాంతార చాప్టర్ 1. మంచి హైప్ నడుమ వచ్చి మొదటి రోజు రికార్డు బుకింగ్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా ఇపుడు నార్త్ అమెరికాలో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని చూపిస్తుంది.

ఇలా అక్కడ కన్నడ, తెలుగు భాషల్లో సాలిడ్ నంబర్స్ ఇంచుమించు దగ్గరదగ్గర నంబర్స్ తో అదరగొడుతున్నట్టు తెలుస్తుంది. ఇలా కాంతార 1 అక్కడ ఆల్రెడీ 6 లక్షల డాలర్స్ మార్క్ ని దాటి 1 మిలియన్ దిశగా దూసుకెళ్తుంది. దీనితో కాంతార అక్కడ బిగ్ నంబర్స్ ని సెట్ చేసేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version