ఎన్.టి.ఆర్ తాజా చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’ ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలవుతుందని ప్రకటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్.టి.ఆర్ కాలేజి స్టూడెంట్ గా ఒక పవర్ ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు థమన్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ను అలరించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ కు మరో అదిరిపోయే ఆల్బం ను అందించాడంట మన థమన్
ఇప్పటికే ఎన్.టి.ఆర్ కు ‘బృందావనం’, ‘బాద్ షా’ వంటి సూపర్ హిట్స్ అందించాడు మనోడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సమంతల మధ్య ఒక పాటను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. సమంత సైతం ఈ పాట తనకు ఇష్టమని తెలిపింది. ఈ సినిమాలో శృతిహాసన్ మరో నాయిక. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న మనముందుకు రానుంది