అల్లు అర్జున్ రేస్ గుర్రం సినిమా షూటింగ్ దాదాపు ముగింపుదశకు చేరుకుంది. ఒక్క పాట మాత్రం బాకీ వున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న థమన్ కొత్తరకం ట్యూన్ లతో బిజీగా వున్నాడు. అల్లు అర్జున్ డ్యాన్సులను దృష్టిలో పెట్టుకుని పెప్పి ట్యూన్ లను కంపోజ్ చేస్తున్నారు. సమాచారం ప్రకారం థమన్ అల్లూ బాబు కోసం ‘డబ్ స్టెప్’ ఒకటి కంపోజ్ చేసాడట. ఈ డబ్ స్టెప్ అనేది ఒక ఎలట్రానిక్ డ్యాన్స్ సంగీతం. పార్టీలకు వెళ్లేవారికి ఇది సుపరిచితమే. ఈ పాట లిరిక్స్ ‘డౌన్ డౌన్ డౌన్ డుప్పా’ అని సాగుతుందట.. ఈ సినిమాలో హై లైట్ గా నిలవనున్న ఈ పాటకు అల్లు అర్జున్ కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాడట
సలోని సెకండ్ హీరోయిన్. రవి కిషన్ విలన్. వేసవి తరువాత ఈ సినిమా మనముందుకు రానుంది