మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో థమన్ ఎస్ కూడా ఒకరు. తన మ్యూజిక్ అండ్ పాటలతో సెపరేట్ మార్క్ సెట్ చేసుకున్న థమన్ ఇపుడు చేస్తున్న పలు సినిమాలకి మరింత అప్లాజ్ అందుకుంటున్నాడు. అయితే థమన్ కెరీర్ లో కూడా చాలా నెగిటివ్ ఎదుర్కొన్నాడు.
కాపీ ట్యూన్స్ విషయంలో కానీ పలువురు హీరోల అభిమానులు తమ హీరో సినిమాకి థమన్ అని తెలిస్తే వారు సోషల్ మీడియాలో మాకు థమన్ వద్దు అనిరుద్ కావాలని ట్రెండ్ చేసినవారు కూడా లేకపోలేరు. ఇది తనకి ఒకింత అవమానకరమే అయినప్పటికీ థమన్ వెనక్కి తగ్గలేదు.
ఎవరైతే తనని వద్దన్నారో వారితోనే తన వర్క్ తో తప్పని ప్రూవ్ చేసాడు. అయితే ఇది గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో “గుంటూరు కారం” సినిమాకి ఒకసారి ప్రూవ్ చేసాడు. మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్ తాను అందించగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో “ఓజి” కోసం అంతకు మించిన క్లాస్ వర్క్ తో షాకిచ్చాడు.
ఒకో సాంగ్ వింటున్న పవన్ అభిమానులకి మతి పోతుంది. ఇలా ఓజి టైం లో అనౌన్సమెంట్ వచ్చినపుడు ఎవరైతే థమన్ వద్దు అనిరుద్ కావాలి అన్నారో వారితోనే ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇలా థమన్ మాత్రం ఇపుడు టాలీవుడ్ లో టాప్ లో దూసుకెళ్తున్నాడు.