థమన్ కి ఛాలెంజ్ విసురుతున్న వకీల్ సాబ్

పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఉమెన్స్ డే కానుకగా ఈ చిత్రం నుండి ఓ సాంగ్ కూడా విడుదల చేయగా మంచి విజయం అందుకుంది. ఐతే పవన్ సినిమాకు సాంగ్స్ అందించడం థమన్ కి ఓ ఛాలెంజ్ లా మారిందట. ఈ మూవీ సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం, దీనితో అటు సినిమా కథకు తగ్గట్టుగా మ్యూజిక్ కంపోజ్ చేయాలి. అదే సమయంలో పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఆ సాంగ్స్ ఉండాలి. ఇదే పెద్ద ఛాలెంజ్ గా థమన్ కి తయారైందట.

దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, హిందీ హిట్ మూవీ పింక్ తెలుగు రిమేక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది, ఈనెలలో విడుదల కావాల్సివుండగా లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదాపడింది.

Exit mobile version