‘ఓజి’ సాంగ్ లీక్.. అసలు నిజం ఏంటో రివీల్ చేసిన థమన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ చిత్రం “ఓజి” సినిమా నుంచి ఇప్పుడు ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాని ఎలా షేక్ చేస్తుందో అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి థమన్ అండ్ టీం ఫస్ట్ బ్లాస్ట్ గా ఒక క్రేజీ ఫస్ట్ సింగిల్ ని వదిలారు. ఇక దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే దీనికి ముందు రోజే సాంగ్ లీక్ అంటూ థమన్, దర్శకుడు సుజీత్ తో ఓ ప్రాంక్ చేస్తే సాంగ్ రిలీజ్ కావాల్సిన రోజు నిజంగానే అనుకున్న దానికంటే ముందే సాంగ్ వచ్చేసింది. దీనితో సాంగ్ ని కావాలనే లీక్ చేసారని చాలా మంది నమ్మారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ స్నాప్ చాట్ లో మొదటిగా దర్శనం ఇచ్చింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత వెంటనే మేకర్స్ సాయంత్రం విడుదల చేస్తామని చెప్పింది కాస్తా మధ్యాహ్నానికే విడుదల చేశారు.

అయితే దీనిపై అసలు నిజాన్ని సంగీత దర్శకుడు థమన్ రివీల్ చేసాడు. అది లీక్ కాదు అని తామే స్నాప్ చాట్ లో అఫీషియల్ గానే విడుదల చేశామని తెలిపాడు. తాను దర్శకుడు అనుకునే చేశామని అయితే స్నాప్ చాట్ లో అల్గారిథమ్ వల్ల కొంచెం ముందే వచ్చింది అని అందుకే ఇక టీం తో కలిసి ముందే విడుదల చేసినట్టు అసలు క్లారిటీ అందించాడు.

Exit mobile version