“మాస్టర్” మేకర్స్ మరోసారి కన్ఫర్మేషన్.!

“మాస్టర్” మేకర్స్ మరోసారి కన్ఫర్మేషన్.!

Published on Sep 12, 2020 2:40 PM IST

ప్రస్తుతం మన దక్షిణాది నుంచో రానున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఇళయ థలపతి విజయ్ నటిస్తున్న “మాస్టర్” చిత్రం కూడా ఒకటి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ ఈ సినిమాతో భారీ అంచనాలను నెలకొల్పుకున్నాడు. ఇప్పటికే అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ భారీ హిట్ కావడం అందులోను లోకేష్ కనగ్ రాజ్ లాంటి హిట్ డైరెక్టర్ తో రావడంతో విజయ్ అభిమానుల్లో తార స్థాయి అంచనాలు పెట్టుకున్నారు.

కానీ లాక్ డౌన్ మూలాన ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. అలాగే మధ్యలో ఓటిటి రిలీజ్ లు ఊపందుకోవడంతో ఈ సినిమాకు కూడా భారీ ధరలు వచ్చాయి కానీ వాటన్నిటినీ తిరస్కరించారు. కానీ మళ్ళీ ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై రూమర్స్ మొదలు కావడంతో వాటన్నిటినీ చిత్ర యూనిట్ కొట్టి పారేసారు. ఈ చిత్రాన్ని అభిమానుల కోరిక మేరకు కేవలం థియేటర్స్ లో మాత్రమే విడుదల చేయనున్నామని ఆ వందంతులు అన్ని ఎవరు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారు.

తాజా వార్తలు