స్టార్ హీరోతో మురుగదాస్ ప్రాజెక్ట్ సెట్టైపోయినట్టే.. ఇక మొదలవడమే ఆలస్యం

స్టార్ హీరోతో మురుగదాస్ ప్రాజెక్ట్ సెట్టైపోయినట్టే.. ఇక మొదలవడమే ఆలస్యం

Published on Oct 3, 2020 3:00 AM IST


తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా చేస్తున్నారు. దాదాపు అంతా పూర్తైపోయిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. దీంతో విజయ్ తర్వాతి సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేయనున్నారు. ఎన్నో నెలల నుండి అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. మళ్లీ ఆరు నెలల తర్వాత సినిమా మొదలయ్యే వాతావరణం కనిపిస్తోంది.

2021 జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఫిబ్రవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో కథానాయకిగా కాజల్ అగర్వాల్, తమన్నాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు ఫైనల్ అవుతారో చూడాల్సి ఉంది. అంతేకాదు స్టోరీ ‘తుపాకి’ తరహాలోనే ఉంటుందని, టైటిల్ ‘తుపాకి 2’ అని, ఇది తప్పకుండా సీక్వెలేనని కోలీవుడ్ వర్గాల టాక్. గతంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన ‘తుపాకి, కత్తి, సర్కార్’ చిత్రాలు భారీ విజయాలను సాధించి ఉండటంతో ఈ సినిమా మీద
అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడ భారీ అంచనాలున్నాయి.

తాజా వార్తలు