ఈ సంక్రాంతి పండగకి 100 కోట్ల బిజినెస్

ఈ సంక్రాంతి పండగకి 100 కోట్ల బిజినెస్

Published on Dec 22, 2012 11:34 AM IST

Nayak-svsc-poster
తెలుగు సినిమాలకి సంక్రాంతి పండగ చాలా కీలకం. పండగ సీజన్ ని సొమ్ము చేసుకోవడానికి ప్రతీసారి పెద్ద సినిమాలు వస్తూనే ఉంటాయి. ఎన్ని సినిమాలు రేసులో నిలిచినా ధమున్న సినిమా పండగ రేసులో గెలుస్తుంది. ఈసారి పండగ రేసులో రెండు తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి వెంకటేష్, మహేష్ బాబు కలిసి అన్నదమ్ములుగా నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కాగా మరొకటి రామ్ చరణ్ ‘నాయక్’. రెండు సినిమాలు ఒక్కోటి 40 నుండి 50 కోట్ల పైగా బిజినెస్ చేసాయి. రెండు కలిపి సంక్రాంతి సీజన్లో 100 కోట్లు వసూలు చేయడం ఖాయం అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. 2012 సంవత్సరం తెలుగు సినిమాకి బాగా కలిసి వచ్చింది. 2013 కూడా ఈ సినిమాలు హిట్ అయి బాగా కలిసి రావాలని కోరుకుందాం.

తాజా వార్తలు